కన్నడ యువ హీరో రాకేష్ కన్నుమూత!

  • గ్యాంగ్రీన్ తో బాధపడుతూ మృతి
  • రెండు నెలల క్రితమే శస్త్రచికిత్స
  • తిరగబెట్టిన వ్యాధి
  • సినీ ప్రముఖుల సంతాపం
బాల నటుడిగా రంగ ప్రవేశం చేసి, ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కన్నడ యువ నటుడు రాకేశ్ (27) కన్నుమూశాడు. శాండల్ వుడ్ అభిమానులు 'బుల్లీ' అని ప్రేమతో పిలుచుకునే రాకేశ్, కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గత కొంతకాలంగా గ్యాంగ్రిన్ (చీముపట్టిన పుండు) వ్యాధితో బాధపడుతున్న ఆయనకు రెండు నెలల క్రితం ఆపరేషన్ కూడా జరిగింది.

ఇటీవల వ్యాధి తిరిగి ముదరడంతో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, రాకేశ్ తల్లిదండ్రులు ఆశారాణి, నాగేశ్ లు కూడా నటులే. చైల్డ్ ఆర్టిస్టుగా 'చెలువినచిత్తార'తో రంగ ప్రవేశం చేసిన రాకేశ్, ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఆయన తాజా చిత్రం 'ధూమపాన' షూటింగ్ ముగింపు దశలో ఉంది. రాకేశ్ మృతి పట్ల శాండల్ వుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

sandalwood
rakesh
gangreen

More Telugu News