కింద పడిన హనీప్రీత్ కాలి చెప్పు ... సెల్ఫీల కోసం ఎగబడిన జనం!

  • ముగిసిన హనీప్రీత్ రిమాండ్
  • విచారణకు సహకరించలేదన్న పోలీసులు
  • ఆమెను వ్యాన్ ఎక్కించిన తరువాత కింద కనిపించిన చెప్పు
  • సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడిన ప్రజలు
డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు 20 సంవత్సరాల జైలుశిక్ష పడిన తరువాత పంచకుల, సిర్సా తదితర ప్రాంతాల్లో జరిగిన విధ్వంసం కేసులో ప్రస్తుతం పోలీసుల రిమాండులో విచారణను ఎదుర్కొంటున్న హనీప్రీత్ ను కోర్టుకు తీసుకు వచ్చిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఆమె రిమాండ్ పూర్తి కావడంతో కోర్టుకు తెచ్చిన పోలీసులు, హనీప్రీత్ విచారణకు ఎంతమాత్రమూ సహకరించలేదని తెలిపారు.

వాదోపవాదాల అనంతరం ఆమెను బయటకు తీసుకురాగా, అక్కడే ఎదురు చూస్తున్న మీడియా ఒక్కసారిగా ఆమెతో మాట్లాడేందుకు ముందుకురికింది. దీంతో హనీప్రీత్ ను వేగంగా పోలీస్ వ్యాన్ లోకి తీసుకెళ్లారు. ఆమె వ్యాన్ అలా ఎక్కగానే, కింద ఓ తెగి పడిన మహిళ చెప్పు కనిపించింది. ఇంకేముంది, అందరూ అది హనీప్రీత్ చెప్పుగానే భావించారు. మీడియా ఫోటోగ్రాఫర్లు ఆ చెప్పు ఫోటోలు తీసేందుకు ఆసక్తి చూపగా, ఎంతో మంది సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. కాగా, కోర్టుకు వచ్చిన హనీప్రీత్ తనకు నడుం నొప్పిగా ఉందని, నిలుచోలేకపోతున్నానని, చేతులు జోడించి పోలీసులకు వేడుకోవడం కనిపించింది.
Go Back to Shorts
honeypreet
dera
gurmeet
court

More Telugu News