పవన్ సూచనలతో హీరోగా మారుతోన్న సాయిధరమ్ తేజ్ సోదరుడు!

  • మాస్ హీరోగా సాయిధరమ్ తేజ్ కి క్రేజ్ 
  • ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా రంగంలోకి 
  • ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పవన్ 
  • ఆయన సూచనలతోనే ముందుకు  
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. ఎవరికి వారు తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్నారు. ఆ జాబితాలో మనకి సాయిధరమ్ తేజ్ కూడా కనిపిస్తాడు. సాయిధరమ్ తేజ్ ను హీరో చేయడం వెనుక పవన్ ఉన్నాడనే టాక్ వచ్చింది. తాజాగా సాయిధరమ్ చేస్తోన్న వినాయక్ మూవీని సెట్ చేసింది కూడా పవన్ అనే చెప్పుకుంటున్నారు.

ఇక సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ విషయంలోను పవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. పవన్ సూచనలు .. సలహాలతో ఇప్పటికే వైష్ణవ్ తేజ్ మార్షల్ ఆర్ట్స్ లోను .. డాన్స్ .. నటన విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. పవన్ ఈ కుర్రాడి కోసం తీరిక దొరికినప్పుడల్లా కథలు వింటున్నాడని అంటున్నారు. పవన్ ఖరారు చేసిన స్క్రిప్ట్ తోనే ఈ కుర్రాడు సెట్స్ పైకి వెళతాడట. వచ్చే ఏడాది వైష్ణవ్ తేజ్ సినిమా మొదలవుతుందని చెబుతున్నారు.   
Go Back to Shorts
sai dharam tej

More Telugu News