'ద్రోహి'.. కమల హాసన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ స్వామి పరిపూర్ణానంద
- రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్న సినీనటుడు కమల హాసన్
- హిందూ ఉగ్రవాదం అంటూ తీవ్ర వ్యాఖ్యలు
- కమల్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి: పరిపూర్ణానంద
- కమల్ వెనుక విషపూరిత ఆలోచనలు
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్న సినీనటుడు కమల హాసన్.. హిందూ ఉగ్రవాదం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కమల హాసన్ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల హాసన్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులను విమర్శిస్తే నాయకులు కాలేరని వ్యాఖ్యానించారు. హిందువులు సినిమాలు చూస్తేనే కమల్ గొప్పనటుడయ్యాడని అన్నారు. కమల్ వెనుక విషపూరిత ఆలోచనలు ఉన్నాయని అన్నారు. కమల హాసన్ 'ద్రోహి'గా మారాడని పరిపూర్ణానంద మండిపడ్డారు.