అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి దుర్మరణం

  • కనెక్టికట్‌ రాష్ట్రంలోని షెల్టన్ సిటీలో ఘటన
  • నడిచి వెళ్తున్న తులసీరామ్‌ను ఢీకొట్టిన కారు
  • కుత్బుల్లాపూర్‌లో విషాద ఛాయలు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన నాగతులసీరామ్ దుర్మరణం పాలయ్యాడు. బ్రిడ్జిఫోర్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న తులసీరామ్ నడచుకుంటూ వెళ్తుండగా ఓ కారు అతడిని ఢీకొట్టింది. షెల్టన్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో తులసీరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులకు తులసీరామ్ మరణవార్త తెలిసింది.

తులసీరామ్‌కు తండ్రి జాకబ్, సోదరి ఉన్నారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తల్లి చనిపోగా తండ్రే వారిని పెంచి పెద్ద చేశాడు. ఉన్నత చదువుల కోసం అప్పు చేసి మరీ కుమారుడిని విదేశాలకు పంపించాడు. తనకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Go Back to Shorts
America
Hyderabad
Accident

More Telugu News