ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పాల్సిందే: ఖుష్బూ

  • సినీ కళాకారులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దు
  • నటనకు ఆహార్యంతో సంబంధం లేదు
  • ఇలాంటి కథనాలు ప్రసారం చేయవద్దు
ప్రముఖ సినీ నటుడు సూర్య ఎత్తును గేలి చేసేలా సన్ నెట్ వర్క్ లో ప్రసారమైన కార్యక్రమంలో వ్యాఖ్యాతలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సూర్య అభిమానులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే విశాల్ లాంటి సినీ ప్రముఖులు దీన్ని ఖండించారు. తాజాగా నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. సూర్యపై వ్యాఖ్యలు సరికావని, సంబంధిత టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నటనకు ఆహార్యంతో సంబంధం లేదని ఆమె ట్వీట్ చేశారు. సినీ కళాకారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇలాంటి కథనాలను ప్రసారం చేయడాన్ని ఇంతటితో ముగించాలని అన్నారు.
Go Back to Shorts
suria
khushboo

More Telugu News