పాతిక కోట్ల క్లబ్బులో 'భాగమతి'!

  • కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమా
  • తొలి రోజున రూ. 12 కోట్లు
  • పాజిటివ్ రివ్యూలతో పెరిగిన ఆదరణ
గత శుక్రవారం విడుదలైన 'భాగమతి' చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళుతోంది. అమెరికాలో తొలి రోజున 1,56,538 డాలర్లను వసూలు చేసిన చిత్రం తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయలు రాబట్టిందని, రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ, రూ. 25 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాకు రివ్యూలు పాజిటివ్ గా రావడంతో ముందుముందు కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా థియేటర్ల సంఖ్యను సైతం పెంచేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, అనుష్క ఈ చిత్రంలో కలెక్టర్ చంచలగా, భాగమతిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను ధరించింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో హారర్ చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Bhagamati
Anushka
Movie
Collections

More Telugu News