భారత ముస్లింను 'పాకిస్థానీ' అని సంబోధిస్తే మూడేళ్లు జైల్లో పెట్టాలి: అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్

  • ఈ మేరకు చట్టం చేయాలి
  • లోక్ సభలో డిమాండ్
  • మోదీ ప్రభుత్వం ఆ పనిచేయదని వ్యాఖ్య
భారత ముస్లింను పాకిస్థానీ అని ఎవరైనా అంటే వారిని శిక్షించేలా చట్టాన్ని తీసుకురావాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఎవరైనా ఇలా మాట్లాడితే వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టం ఉండాలన్నారు. ఈ మేరకు అసదుద్దీన్ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే చర్చలో మాట్లాడారు.

అయితే, ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ తరహా బిల్లును పార్లమెంటుకు తీసుకురాలేదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును మహిళల వ్యతిరేకమైనదిగా ఆయన అభివర్ణించారు. మొహమ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని భారత్ లోని ముస్లింలు తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Go Back to Shorts
Asaduddin Owaisi

More Telugu News