ఎవరు ధనవంతులో తేల్చుకునేందుకు పోటీలు పడి డబ్బులు కాల్చేశారు!

  • పార్టీలో స్నేహితుల మధ్య వివాదం
  • ధనవంతుడిని తానంటే తానని వాగ్వాదం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
సరదాగా పార్టీ చేసుకునేందుకు వచ్చిన స్నేహితుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అక్కడున్న వారిలో ఎవరు ధనవంతులన్న ప్రశ్న వచ్చింది. నేనంటే నేనని వాగ్వాదానికి దిగిన ఇద్దరు స్నేహితులు దానిని  నిరూపించుకునేందుకు పోటీలుపడి కరెన్సీ నోట్లను తగలబెట్టారు. 100 యువాన్ నోట్లను కాల్చేశారు.

 ఈ తతంగాన్ని ఓ స్నేహితుడు వీడియో తీసి  సోషల్ మీడియాలో పెట్టడంతో సంచలనమైంది. చైనాలో నోట్లను కాల్చడం  క్రిమినల్ చర్య కావడంతో పోలీసులు వారిని గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఇద్దరికీ చెరో 1,000 యువాన్లు (రూ.10,000) జరిమానా విధించింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను మీరూ చూడండి.
Go Back to Shorts
China
yuan
currency
burn

More Telugu News