తారాలోకం, అభిమానుల అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు

  • ఏడు కిలోమీటర్ల మేర జరిగిన అంతిమ యాత్ర
  • విల్లే పార్లేలోని సేవా సమాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
  • మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
 శ్రీదేవి భౌతిక కాయానికి ముంబయిలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. ఆమె అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర జరిగి, విల్లే పార్లేలోని సేవా సమాజ్ శ్మశానవాటికకు చేరుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. తారాలోకం, అభిమానులు ఆమెను కడసారి చూడడానికి అక్కడకు చేరుకున్నారు. అందరి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు అధికారులు ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. 
Go Back to Shorts
Sridevi
funeral ceremony
mumbai

More Telugu News