'2.0' లీక్ దృశ్యాలను చూశా... కారణమేదైనా అదిరిపోయాయి: రాంగోపాల్ వర్మ

  • లీకైన '2.0' దృశ్యాలు
  • మతిపోగొడుతున్నాయన్న రాంగోపాల్ వర్మ
  • చిత్రం విడుదలపై ఇంకా రాని స్పష్టత
ద‌క్షిణాది ప్రముఖ ద‌ర్శకుడు శంక‌ర్‌ దర్శకత్వంలో, సూప‌ర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా తెరకెక్కుతున్న '2.0' చిత్రంలోని కొన్ని దృశ్యాలు లీక్ కాగా, వాటిని చూసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. లీక్ కు కారణాలు ఏమైనప్పటికీ, లీకైన టీజర్ లోని దృశ్యాలు అద్భుతమని కొనియాడాడు.

పూర్తిగా సిద్ధంకాని ఆ సన్నివేశాలే మతిపోగొడుతున్నాయని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. కాగా, సుమారు మూడు సంవత్సరాలుగా నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమా విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేదన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలాఖరున చిత్రం విడుదల చేస్తామని ప్రకటించిన శంకర్, ఆపై ఇటీవల విడుదలను ఆగ‌స్టు నెల‌కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.
Go Back to Shorts
2.0
Ramgopal Varma
Shankar
Rajanikant

More Telugu News