'రంగస్థలం' ఎన్టీఆర్ చేస్తే ఎలా వుంటుందనే ప్రశ్నకి సుకుమార్ సమాధానం!

  • చరణ్ నా ఆలోచనలను ఆక్రమించాడు 
  • ఆయన మాత్రమే చేయగలడు అనిపించాడు 
  • ఒకే పాత్ర విషయంలో హీరోల మధ్య పోలిక కరెక్ట్ కాదు
'రంగస్థలం' సినిమా సంచలన విజయం సాధించడంతో సుకుమార్ ఫుల్ ఖుషీగా వున్నారు. ఈ సినిమాను గురించి ఆయన ఒక వేదికపై మాట్లాడుతూ, చరణ్ తప్ప మరెవరూ ఈ పాత్రను ఇంతలా చేయలేరు అన్నారు. ఆ విషయాన్ని ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో గుర్తుచేస్తూ, ఇదే పాత్రని ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందని అడిగారు.

అందుకు సుకుమార్ స్పందిస్తూ .. "సినిమా పూర్తయ్యే సరికి ఇతను తప్ప ఈ పాత్రను ఇంతకన్నా గొప్పగా ఎవరూ చేయలేరని నాకు అనిపించేలా చేయడం ఆర్టిస్ట్ సక్సెస్ అని చెబుతాను. అలా నా ఆలోచనలను చరణ్ ఆక్రమించేసి అలా అనిపించేలా చేశాడు. ఇక ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందని మీరు అడుగుతున్నారు .. ఇద్దరు వ్యక్తులకు 100 మీటర్ల పరుగు పందెం పెట్టామనుకోండి .. వాళ్లిద్దరూ పరిగెడుతుంటే ఎవరు గెలుస్తారని చెప్పొచ్చు. అలాగే ఇదే సినిమాను ఒక వైపున చరణ్ తోను .. మరో వైపున ఎన్టీఆర్ తోను చేస్తున్నాననుకోండి, ఎవరు బాగా చేశారంటే చెప్పొచ్చు. ఒక హీరో చేసిన దానిని ఇంకో హీరో ఎలా చేస్తాడని ఊహించుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం" అని చెప్పుకొచ్చారు.  

Go Back to Shorts
charan
sukumar

More Telugu News