హైదరాబాద్‌లో ఐస్‌క్రీములు, సోడాలు అమ్మిన రామ్‌ చరణ్‌ తేజ్‌.. ఫొటోలు ఇవిగో!

  • 'మేము సైతం' కార్యక్రమంలో చెర్రీ
  • మంచు లక్ష్మీ నిర్వహిస్తోన్న ప్రోగ్రాం
  • సెల్ఫీలు తీసుకున్న చిన్నారులు
సినీనటి మంచు లక్ష్మీ నిర్వహిస్తోన్న 'మేము సైతం' కార్యక్రమంలో పాల్గొన్న మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ తేజ్‌.. పేదలకు సాయం చేయడానికి ఐస్‌క్రీములు, సోడాడు అమ్మాడు. హైదరాబాద్‌లోని సారథి స్టూడియో వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెర్రీ చిన్నారులకు ఫొటోలకు పోజులిచ్చాడు. రామ్ చరణ్‌ తేజ్‌ని చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. వారితో మాట్లాడుతూ రామ్ చరణ్‌ తేజ్‌ సందడి చేశాడు. చెర్రీతో ఫొటోలు దిగుతోన్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.             
Go Back to Shorts
manchi laxmi
Ramcharan
Hyderabad

More Telugu News