కాసేపట్లో తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ ప్రారంభం

  • సరూర్‌ నగర్‌ మైదానంలో సభ
  • పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న కోదండరామ్‌
  • పార్టీ విధివిధానాలను ప్రకటించనున్న తెజస
టీజేఏసీ మాజీ ఛైర్మన్‌, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ మైదానానికి కోదండరామ్‌తో పాటు టీజేఏసీ నాయకులు చేరుకోనున్నారు. ఈ సభ ద్వారా తమ పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు. అలాగే, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడిగా నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలంగాణలో పాలనా పరంగా పలు మార్పులు రావాల్సి ఉందని చెబుతోన్న కోదండరామ్‌.. తమ పార్టీ తెలంగాణలో ఎలా ప్రత్యామ్నాయ వేదికగా మారబోతోందనే విషయంపై స్పష్టతనివ్వనున్నారు. అలాగే, ఈ సభలో వివిధ అంశాలపై తీర్మానాలు చేసి, తమ పార్టీని ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలనే విషయంపై ప్రసంగించనున్నారు. 
Go Back to Shorts
Telangana Jana Samithi
Kodandaram
Hyderabad

More Telugu News