ముంబై ఇండియన్స్ అద్భుత విజయం

  • కేకేఆర్ పై 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం
  • తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్
  • 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి ఓడిన కేకేఆర్
ఐపీఎల్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

అనంతరం 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ లో మెక్ క్లాగాన్ వేసిన బంతిని కొట్టిన ఓపెనర్ క్రిస్ లిన్ (17)  బుమ్రాకు క్యాచ్ ఇవ్వడంతో అవుటయ్యాడు. ఉతప్ప, రానాల జోడీ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే, ముంబై ఇండియన్స్ పటిష్టమైన బౌలింగ్ లో కేకేఆర్ మరిన్ని వికెట్టు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 168 పరుగులకే ఆలౌటైంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఇది నాల్గో విజయం కాగా, కేకేఆర్ ఐదో ఓటమిని చవిచూసింది. 
Go Back to Shorts
ipl
mumbai indians
kolkata

More Telugu News