ఎమ్మెల్యేలను కొనే పనిలో యడ్డీ కుమారుడు.. సాక్ష్యాలు విడుదల చేసిన కాంగ్రెస్

  • యడ్యూరప్ప కుమారుడు ప్రలోభాలకు పాల్పడ్డారన్న కాంగ్రెస్
  • రూ. 5 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేశారంటూ ఆరోపణ
  • ఆడియో సాక్ష్యం విడుదల
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరోపించింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ప్రలోభాలకు పాల్పడ్డారని తెలిపింది. తమ ఎమ్మెల్యేలకు రూ. 5 కోట్లు, మంత్రి పదవిని ఆఫర్ చేశారని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ ఆడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది. ఇందులో విజయేంద్ర మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ సాయంత్రం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఆడియో సంచలనంగా మారింది.

నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే దద్దల్ తో గాలి జనార్దనరెడ్డి మాట్లాడినట్టుగా ఉంది. బీజేపీకి మద్దతు పలికితే... మీ జీవితం సెటిల్ అయిపోతుంది అంటూ గాలి సూచించడం ఇందులో ఉంది.

yeddyurappa
son
vijayendra
congress
mla

More Telugu News