టీవీ సీరియల్‌లో ఆత్మహత్య సీన్‌.. అనుకరించిన చిన్నారి మృతి!

  • కోల్‌కతా శివారు ఇచ్చాపుర్‌ పట్టణంలో ఘటన
  • బయటకు వెళ్లిన తల్లిదండ్రులు
  • ఇంటికి వచ్చి చూసేసరికి ఉరి వేసుకుని కనపడ్డ వైనం
టీవీ సీరియల్ చూసిన ఓ చిన్నారి అచ్చం అందులో చూపినట్లుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్కార్ఫ్‌తో ఉరి వేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారు ఇచ్చాపుర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి, తమ కూతురు ఫ్యాన్‌కి వేలాడుతూ ఉండడం చూసి షాకయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది.

ఆ బాలిక అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. తమ కూతురు సీరియళ్లలో వచ్చే సీన్లను అనుకరిస్తూ తమను అలరించేదని, చివరకు వాటి కారణంగానే ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. ఇంట్లో తమ ఏడేళ్ల కూతురితో పాటు, రెండు నెలల బాబుని ఉంచి ఆసుపత్రికి వెళ్లామని చెప్పారు.            
Go Back to Shorts
tv
girl
died

More Telugu News