అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి దినపత్రిక కార్యాలయంలో.. ఐదుగురి మృతి!

  • విచక్షణ రహితంగా కాల్పులు
  • ప్రాణభయంతో పరుగులు తీసిన ఉద్యోగులు
  • నిందితుడి అరెస్ట్
అమెరికాలో మరోమారు తుపాకి గర్జించింది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఓ పత్రికా కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. ఎన్నాపొలిస్ నుంచి ప్రచురితమయ్యే ‘క్యాపిటల్‌ గెజిట్‌’ దినపత్రిక కార్యాలయంలో గురువారం జరిగిందీ ఘటన.

నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలోకి తుపాకితో ప్రవేశించిన సాయుధుడు వచ్చీ రావడంతోనే కాల్పులతో విరుచుకుపడ్డాడు. దీంతో ఉద్యోగులు భయంతో బల్లల కింద దూరి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. దుండగుడి కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్టు సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భవనాన్ని ఖాళీ చేయించి తనిఖీ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
America
Gun
Paper
Fire

More Telugu News