అమెరికాలోని భారతీయుడి ఇంట్లో చైల్డ్ పోర్న్ వీడియోలు.. 52 నెలల జైలు శిక్ష!

  • అభిజిత్ నుంచి 1000 ఫోటోలు, 380 వీడియోలు స్వాధీనం 
  • దోషిగా తేలడంతో శిక్ష ఖరారు
  • జైలు నుంచి విడుదలయ్యాక కూడా పదేళ్ల పర్యవేక్షణ
చిన్నపిల్లల నీలి చిత్రాలు కలిగి ఉన్నాడన్న కేసులో దోషిగా తేలడంతో అమెరికా కోర్టు భారతీయుడికి నాలుగేళ్ల, నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, విడుదలయ్యాక కూడా అతడిపై పదేళ్లపాటు పర్యవేక్షణ కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది.

పిట్స్‌బర్గ్‌కు చెందిన అభిజిత్ దాస్(28) వద్ద చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన 1000 ఫొటోలు, 380 వీడియోలను గుర్తించినట్టు అటార్నీ స్కాట్ బ్రాడీ కోర్టుకు వివరించారు. నేరం నిరూపణ కావడంతో అభిజిత్‌కు 52 నెలల జైలు శిక్ష విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మరో 10 ఏళ్లపాటు అతడిపై పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Go Back to Shorts
America
child porn
Indian
Jail

More Telugu News