తన భర్త కరుణానిధి మరణించారన్న సంగతి ఇప్పటికీ రెండో భార్య దయాళు అమ్మాళ్ కు తెలియదు!

  • గత రెండేళ్లుగా దేన్నీ గుర్తించలేని స్థితిలో దయాళు
  • జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయిన వైనం 
  • భర్త దూరమైనా తెలుసుకోలేకపోయిన దయాళు
తనకు తోడున్న ఆ చేతులు ఇక రావని, ఆయన ఇక కనపడడని చెప్పినా తెలుసుకోలేని స్థితిలో ఉందా తల్లి. తన జీవిత భాగస్వామి తిరిగిరాని లోకాలకు వెళ్లాడని, ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయని ఇప్పటికీ, కరుణానిధి రెండో భార్య దయాళు అమ్మాళ్ కు తెలియదు. చెప్పినా ఆమెకు అర్థంకాదు కూడా.

 గత రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె, కళ్ల ముందు కనిపించేదానిని దేన్నీ గుర్తించలేని స్థితిలో ఉంది. ఆమె జ్ఞాపకశక్తి కూడా దెబ్బతింది. భర్త ఆఖరి మజిలీకి చేరుకున్నా ఆమె ఎప్పటిలానే ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయింది. గత వారంలో కరుణానిధి ఆసుపత్రిలో మృత్యుదేవతతో పోరాడుతున్న వేళ, దయాళు అమ్మాళ్ ను ఆసుపత్రికి తీసుకువచ్చిన అళగిరి, కాసేపు ఆసుపత్రిలో కరుణ ముందు ఉంచి తీసుకెళ్లారు.

ఆపై మంగళవారం ఆయన మరణించగా, గోపాలపురంలోని ఇంట్లోకి పార్థివ దేహాన్ని తీసుకువెళ్లినప్పుడు కూడా ఆమె ఇంట్లో ఉన్నా, జరుగుతున్నదేమీ గుర్తించే స్థితిలో లేరు. అందువల్లే మెరీనా బీచ్ లో జరిగిన అంత్యక్రియలకు ఆమెను తీసుకురాలేదు. మూడో భార్యా రాజాత్తి అమ్మాళ్ మాత్రమే హాజరయ్యారు.
Go Back to Shorts
Karunanidhi
Dayalu Ammal
Tamilnadu

More Telugu News