మేనమామ హరికృష్ణ గురించి నారా లోకేష్ ఏం చెప్పారంటే..!

  • మామయ్య గొప్ప మానవతావాది
  • తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేవారు
  • ఆయన మరణం తీరని లోటు
కామినేని ఆసుపత్రిలో తన మేనమామ హరికృష్ణ భౌతికకాయాన్ని చూసిన మంత్రి నారా లోకేష్ కంటతడి పెట్టారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన భౌతికకాయంపై పూలమాలను ఉంచి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, హరికృష్ణ గొప్ప మానవతావాది అని చెప్పారు. ఏ విషయమైనా సరే తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు, నిర్మొహమాటంగా చెప్పేవారని తెలిపారు. ఆయన మరణం తమ కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 
Go Back to Shorts
harikrishna
Nara Lokesh

More Telugu News