జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా ఆమ్రపాలి

  • నిన్నటి బదిలీలలో స్వల్ప మార్పులు
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు
  • మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా భారతి హొళికేరి
తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ గా వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రస్తుతం జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ గా ఉన్న భారతి హొళికేరిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న శశాంకను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయగా, వ్యవసాయశాఖ కమిషనర్ గా రాహుల్ బొజ్జాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా రజత్ కుమార్ సైనీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క, ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బదిలీని ప్రభుత్వం రద్దు చేసింది.
Go Back to Shorts
ghmc
amrapali

More Telugu News