కేసీఆర్ బయోపిక్‌లో అవకాశం వస్తే వదులుకోను: నవాజుద్దీన్

  • కేసీఆర్ బయోపిక్ లో నవాజుద్దీన్ నటిస్తున్నారంటూ ప్రచారం
  • నన్నెవరూ సంప్రదించలేదన్న నవాజుద్దీన్
  • అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానంటూ స్పష్టీకరణ
ప్రస్తుతం సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా మంచి సక్సెస్‌ను అందుకోవడంతో బయోపిక్‌లు ఊపందుకున్నాయి. ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు చంద్రబాబు, ఇంకోవైపు వైయస్, కేసీఆర్ ల బయోపిక్‌లు ప్రస్తుతం తెరకెక్కుతున్నాయి.

ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. కేసీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారనే వార్తలు ఈ మధ్యకాలంలో వినవస్తున్నాయి. కానీ ఈ బయోపిక్‌కు సంబంధించి తననెవరూ సంప్రదించలేదని నవాజుద్దీన్ తెలిపారు. ప్రస్తుతం నవాజుద్దీన్ ఇండో-పాక్ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మంటో’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నవాజుద్దీన్ హైదరాబాద్‌లో పర్యటించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ బయోపిక్ విషయమై స్పందించిన ఆయన ఈ చిత్రానికి సంబంధించి తననెవరూ సంప్రదించలేదని తెలిపారు. కేసీఆర్ వంటి మంచి నాయకుడి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.
Go Back to Shorts
kcr
biopic
navajuddin
tollywood
bollywood

More Telugu News