హైదరాబాదులో మరో మారుతీరావు.. పరువుహత్యకు యత్నించిన యువతి తండ్రి

  • ఎర్రగడ్డలో ప్రేమజంటపై దాడి చేసిన అమ్మాయి తండ్రి
  • విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి, పరారు
  • రక్తపు మడుగులో ఉన్న ప్రేమ జంటను ఆసుపత్రిలో చేర్పించిన స్థానికులు
మిర్యాలగూడ పరువు హత్యను మరిచిపోకముందే... హైదరాబాదులో అలాంటి ఘటనే మరొకటి చేసుకుంది. నగరంలోని ఎర్రగడ్డలో ప్రేమజంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. కత్తితో పొడిచి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ప్రేమికులిద్దరూ గాయపడ్డారు. పక్కనే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి... రక్తపు మడుగులో ఉన్న ప్రేమికులను సమీపంలో ఉన్న నీలిమ ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు సమాచారం. దాడి చేసింది ఎవరు అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ... అమ్మాయి తండ్రే దాడి చేశాడని, కత్తిపోట్లకు గురైన తర్వాత దాడి చేసింది తన తండ్రే అని అమ్మాయి చెప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

borabanda
murder attack
lovers
father

More Telugu News