'అరవింద సమేత' నుంచి 'రెడ్డి ఇక్కడ సూడు' లిరికల్ వీడియో

  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • రాయలసీమ యాసలో పాట 
  • ఆకట్టుకుంటోన్న పదాల గారడీ  
ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమా రూపొందింది. ఈ సినిమాకి తమన్ అందించిన బాణీలకు యూత్ నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"రెడ్డి ఇక్కడ సూడు .. యెత్తీ సలవా జోడు .. చొరవా కలిపి పిలిచే .. కలికీ పచ్చల ఈడు, వరసా కలిపే నేడు .. కురసా రైకల తాడు .. సరసాకు పిలిసి కట్టు .. పసిడి పుస్తెల తాడు" అంటూ ఈ పాట కొనసాగుతోంది. 'వేట కత్తికి మీసం పెడితే నాకులాగే వుంటాది .. పూల బొత్తికి ఓణీ చుడితే నీకు మల్లే వుంటాది' అనే పద ప్రయోగాలు బాగున్నాయి. తమన్ సంగీతం హుషారెత్తించేలా వుంది. దలేర్ మెహందీ .. అంజనా సౌమ్య ఆలపించిన ఈ పాట .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసేలా వుంది. అక్టోబర్ 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Go Back to Shorts
ntr
pooja hegde

More Telugu News