'అరవింద' హిట్ అయినా నిరాశకి లోనైన ఈషా రెబ్బా

  • 'అరవింద'పై ఆశలు పెట్టుకున్న ఈషా రెబ్బ
  • పాత్ర నిడివి తగ్గడం వలన రాని గుర్తింపు
  • 'అరవింద' కోసం వదులుకున్న రెండు సినిమాలు
తెలుగు కథానాయికగా ఈషా రెబ్బాకి మంచి క్రేజ్ వుంది. 'అరవింద'కి ముందు ఆమె చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా కనిపిస్తూ వచ్చింది. 'అరవింద' సినిమాయే ఆమె కెరియర్లో పెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఈషా రెబ్బాకి మంచి పేరు వస్తుందనీ, ఆమె బిజీ అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ 'అరవింద సమేత' సినిమాలో ఈషా రెబ్బా పాత్రకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడం వలన, ఆమె ప్రభావం ప్రేక్షకులపై అంతగా లేకుండా పోయింది. దాంతో ఈషా రెబ్బాకి ఆశించిన స్థాయిలో ఈ సినిమా క్రేజ్ తీసుకురాలేకపోయింది. దాంతో అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ రావడం లేదు. 'అరవింద'కి ముందు ఈషాకి రెండు సినిమాలు వచ్చాయట. 'అరవింద'ను చూసుకుని ఆమె వాటిని వదిలేసిందట. ఇప్పుడు ఆ రెండు సినిమాలు పోయినందుకు .. 'అరవింద' చేసినందు వలన పెద్దగా ప్రయోజనం లేనందుకు ఈషా నిరాశకి లోనైందని చెప్పుకుంటున్నారు. 
Go Back to Shorts
ntr
eesha rebba

More Telugu News