చిరూలోని గొప్ప లక్షణాలు చరణ్ లో కూడా వున్నాయి: వివేక్ ఒబెరాయ్

  • చరణ్ చాలా కష్టపడతాడు 
  • ఆయన అంకితభావం నచ్చింది 
  • ఈ  సినిమాతో నాకు మంచి తమ్ముడు దొరికాడు
హిందీలో విలక్షణ నటుడిగా వివేక్ ఒబెరాయ్ కి మంచి క్రేజ్ వుంది. ఎన్నో భారీ సినిమాల్లో నటించి తన సత్తా చూపాడాయన. అలాంటి వివేక్ ఒబెరాయ్ తాజాగా తెలుగులో బోయపాటి - చరణ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఈ విలన్ పాత్ర ప్రత్యేకమైనది .. బలమైనది కావడంతోనే వివేక్ ను తీసుకున్నారు. ఆయన పోర్షన్ కి సంబంధించిన షూటింగు తాజాగా పూర్తయింది. దాంతో ఆయన ఈ సినిమా షూటింగు గురించి ప్రస్తావించాడు.

'ఈ సినిమాలో నటించడం మరిచిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. కెమెరా ముందుకు వస్తే చరణ్ .. నేను కొట్టుకోవడం, కెమెరా వెనుక అన్నదమ్ములుగా ఉండటం చేసేవాళ్లం. ఈ సినిమాతో నేను చరణ్ వంటి ఒక మంచి తమ్ముడిని సంపాదించుకోగలిగాను. చరణ్ కష్టపడే తత్వం .. ఆయన అంకితభావం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. చిరంజీవిగారిలోని గొప్ప లక్షణాలన్నీ నాకు చరణ్ లో కనిపించాయి. చరణ్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా వుంది. మా ఇద్దరి కాంబినేషన్ కి మంచి మార్కులు పడతాయనే నమ్మకం వుంది' అన్నాడు. దీపావళికి ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రానుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.    
Go Back to Shorts
charan
vivek

More Telugu News