13 మంది అభ్యర్థుల పేర్లతో మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

  • జనగాం నుంచి పొన్నాలకు లైన్ క్లియర్
  • తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్
  • ఇల్లెందు అభ్యర్థి హరిప్రియ నాయక్
మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 25 సీట్లను మిత్రపక్షాలు టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించింది. తాజాగా 13 మంది అభ్యర్థులతో కూడిన తన మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో టికెట్ సాధించుకున్న అభ్యర్థుల వివరాలు ఇవే.

  • బోథ్ (ఎస్టీ) - సోయం బాపూరావు
  • నిజామాబాద్ అర్బన్ - తహెర్ బిన్ హమ్దాన్
  • నిజామాబాద్ రూరల్ - రేకుల భూపతి రెడ్డి
  • బాల్కొండ - ఇ అనిల్ కుమార్ 
  • లాల్ బహదూర్ నగర్ - డి సుధీర్ రెడ్డి
  • కార్వాన్ - ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రి
  • యాకత్ పురా - కె రాజేందర్ రాజు
  • బహదూర్ పురా - కలీం బాబా
  • కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్ రెడ్డి
  • దేవరకొండ (ఎస్టీ) - బాలు నాయక్
  • తుంగతుర్తి (ఎస్సీ) - అద్దంకి దయాకర్
  • జనగాం - పాన్నాల లక్ష్మయ్య
  • ఇల్లెందు (ఎస్టీ)- బానోతు హరిప్రియ నాయక్.
మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

telangana
congress
3rd list
candidates
mahakutami

More Telugu News