25 లక్షలు కాదు.. 25 కోట్లు ఇచ్చినా ఆయన ఆ పని చేయడు: కేసీఆర్

  • ఒవైసీకి కాంగ్రెస్ నేతలు రూ. 25 లక్షలు ఆశ చూపారు
  • ముస్లిం రిజర్వేషన్లను మోదీ పట్టించుకోలేదు
  • 17 మంది ఎంపీలను గెలిపిస్తే రిజర్వేషన్లను తీసుకొస్తాం
నిర్మల్ లో ప్రచారం చేయకుండా ఉంటే రూ. 25 లక్షలు ఇస్తామంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కాంగ్రెస్ నేతలు ఆశ చూపారని... రూ. 25 కోట్లు ఇచ్చినా అసద్ అలాంటి పనులు చేయరని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలు కలసి పని చేస్తున్నాయని చెప్పారు.

ముస్లింలంతా టీఆర్ఎస్ కే అండగా ఉంటారని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేశామని, 30 లేఖలు కూడా రాశామని, అయినా మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. ఒవైసీ సహా 17 మంది ఎంపీలను గెలిపిస్తే ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ కేసీఆర్ పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
kcr
Asaduddin Owaisi
mim
TRS
congress
modi

More Telugu News