శంకర్ మ్యాజిక్ చేశాడు... '2.0' హిట్టేనట!

  • పాజిటివ్ గా వస్తున్న తొలి రివ్యూలు
  • చివరి 30 నిమిషాలు రెప్పార్పలేనంత గ్రాఫిక్స్
  • 'బాహుబలి' రికార్డులు మాయమవుతాయంటున్న ఫ్యాన్స్
ఈ ఉదయం విడుదలైన రజనీకాంత్ తాజా చిత్రం '2.ఓ' బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేసిందని తొలి రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమాను శంకర్ అద్భుతంగా చిత్రీకరించారని, చివరి 30 నిమిషాల పాటు రెప్పార్పకుండా చూసేంత అద్భుత గ్రాఫిక్స్ ఉన్నాయని ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసే చిత్రంగా ఇది నిలుస్తుందని సంబరాలు చేస్తున్నారు. 'రోబో'కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంలో పాత సినిమా జ్ఞాపకాలను, అందులోని పాత్రలైన డాక్టర్ బోరా, సన పాత్రలను స్పృశించారని, దీంతో కథ అత్యంత ఆసక్తికరంగా ఉందని అంటున్నారు.

కాగా, ఈ చిత్రంపై పలు మీడియా సంస్థలు పాజిటివ్ రివ్యూలను ఇస్తున్నాయి. ఇక ఈ చిత్రం 'బాహుబలి' రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు అంటున్నారు.
Go Back to Shorts
Robo
2.0
Shankar
Rajanikant
Hit
Movie

More Telugu News