ఊహ రీ ఎంట్రీ గురించి శ్రీకాంత్

  • 'ఊహ' నటించాలనుకుంటే ఓకే 
  • రెండో అబ్బాయి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు 
  • ఊహ మరింత బిజీ కానుంది      
నిన్నటి తరం కథానాయికలలో చాలామంది ఈ మధ్య రీ ఎంట్రీ ఇస్తున్నారు. రమ్యకృష్ణ .. నదియా .. ఖుష్బూ రీ ఎంట్రీ లోను అదరగొట్టేస్తున్నారు. ఇక సిమ్రాన్ .. ఆమని వంటి మరికొందరు కూడా ఇదే బాటలో తమ ప్రయాణాన్ని ఆరంభించారు. ఈ నేపథ్యంలో 'ఊహ' కూడా రీ ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని గురించిన ప్రశ్న శ్రీకాంత్ కి ఎదురైంది.

అందుకు ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ .. "పెళ్లి తరువాత నటించకూడదనేది 'ఊహ' నిర్ణయమే. ఒకవేళ ఇప్పుడు నటించాలని అనుకుంటే అది ఆమె ఇష్టమే. అయితే పిల్లలిద్దరూ పెద్దవాళ్లు కావడం వలన ఇప్పుడు ఆమె బాధ్యతలు మరింత పెరిగాయి. మా పెద్దబ్బాయితో పాటు చిన్నబ్బాయి కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. కనుక ఇంతకుముందు కంటే ఊహ ఇప్పుడు మరింత బిజీ కాబోతోంది" అని చెప్పుకొచ్చారు. ఆయన సమాధానాన్ని బట్టి 'ఊహ' రీ ఎంట్రీ ఉండదనే అనుకోవలసి ఉంటుంది. 
Go Back to Shorts
srikanth
ooha

More Telugu News