వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై తొలిసారి స్పందించిన బాలకృష్ణ

  • మరో మూడు రోజుల్లో విడుదల కానున్న 'ఎన్టీఆర్'
  • ఏం సినిమా తీయాలన్నది వర్మ వ్యక్తిగతం
  • తమ అనుమతిని అడగలేదన్న బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన దివంగత నేత 'ఎన్టీఆర్' బయోపిక్ లోని మొదటి భాగం, మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇక 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' పేరిట రామ్ గోపాల్ వర్మ మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో, దీనిపై మీ స్పందనేంటని బాలకృష్ణను మీడియా అడిగిన వేళ, ఆయన నవ్వుతూ స్పందించారు.

"వర్మ ఏం కథతో సినిమా తీస్తున్నారో, ఏ కోణం నుంచి తీస్తున్నారో నాకు తెలియదు. ఏ సినిమా తీయాలన్నది ఆయన ఇష్టం, వ్యక్తిగతం. ఆయన మా అనుమతిని ఎన్నడూ కోరలేదు. మేము మాత్రం మా వాళ్ళందరితో మాట్లాడి, అనుమతి తీసుకునే సినిమా చేస్తున్నాం. ఈ సినిమాపై నా రియాక్షన్‌ కన్నా ప్రజలు, ప్రేక్షకుల రియాక్షనే ముఖ్యం" అని అన్నారు.
Go Back to Shorts
Balakrishna
NTR
Ramgopal Varma
Lakshmi's NTR

More Telugu News