త్వరలో టాలీవుడ్ భామ అనీషా పెళ్లి

  • అనీషా ఆంబ్రోస్ తొలిచిత్రం 'అలియాస్ జానకి'
  • జేఎంఆర్ కన్ స్ట్రక్షన్ ఈడీ గుణ జక్కతో నిశ్చితార్థం
  • ఇప్పటి వరకు 10 చిత్రాల్లో నటించిన అనీషా
'అలియాస్ జానకి' చిత్రంతో హీరోయిన్ అయిన ముద్దుగుమ్మ అనీషా ఆంబ్రోస్ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఇటీవల వచ్చిన 'నగరానికి ఏమైంది?' చిత్రంలో నటించిన అనీషా, ఆ తర్వాత మళ్లీ ఏ సినిమా చేయలేదు. జేఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ ఈడీ గుణ జక్కతో గత నెల చివరి వారంలో ఆమె నిశ్చితార్థం చాలా సీక్రెట్ గా జరిగిపోయింది. తాజాగా తన నిశ్చితార్థ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో... ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కేవలం కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితుల సమక్షంలోనే నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం. ఇప్పటి వరకు 10 చిత్రాల్లో అనీషా నటించింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. 
Go Back to Shorts
anisha ambrose
wedding
tollywood

More Telugu News