అది మహేశ్ బాబు సెంటిమెంట్ అంతే ..!

  • షూటింగు దశలో 'మహర్షి'
  • ఏప్రిల్ 25వ తేదీన విడుదల 
  • ఉరుకులు పరుగులు పెడుతోన్న యూనిట్  
మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' నిర్మితమవుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను మే నెలలో గానీ .. జూన్ లో గాని విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ముందుగా చెప్పినట్టుగా ఏప్రిల్ 25వ తేదీనే విడుదల చేయాలని మహేశ్ బాబు పట్టుబట్టడంతో, దిల్ రాజు అదే తేదీని ఖరారు చేస్తూ ప్రకటన కూడా చేసేశారు.

అయితే తనకి గల సెంటిమెంట్ కారణంగానే విడుదల తేదీ విషయంలో మహేశ్ బాబు పట్టుబట్టాడని తెలుస్తోంది. గతంలో మే నెలలో విడుదలైన మహేశ్ బాబు సినిమాలు పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఏప్రిల్లో విడుదలైన 'పోకిరి' .. 'భరత్ అనే నేను' భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన 'మహర్షి'ని ఏప్రిల్లో రిలీజ్ చేయవలసిందేనని తేల్చి చెప్పాడట. దాంతో ఆ తేదీని దృష్టిలో పెట్టుకుని అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News