రన్ వే నుంచి గడ్డిలోకి దూసుకెళ్లిన విమానం... బతుకు జీవుడా అంటూ బయటపడిన ప్రయాణికులు

  • విమానంలో 122 మంది
  • పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • ఫిలిప్పీన్స్ లో ఘటన 
ఫిలిప్పీన్స్ లో ఓ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదం తప్పించుకోవడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఫిలిప్పీన్స్ లోని కలిబో విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. తైవాన్ కు చెందిన ఓ విమానం 122 మందితో కలిబో ఎయిర్ పోర్టులో ల్యాండవుతుండగా ఒక్కసారిగా రన్ వే చివర్లో మలుపు తిరిగే ప్రయత్నంలో పక్కనే ఉన్న గడ్డిలోకి దూసుకెళ్లింది. విమానం చక్రాలు గడ్డిలో చిక్కుకుపోవడంతో విమానం అక్కడే నిలిచిపోయింది. పైలట్ వెంటనే అప్రమత్తమై విమానం ఇంజిన్ ఆఫ్ చేసేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం ఎయిర్ పోర్ట్ సిబ్బంది, భద్రత సిబ్బంది వచ్చి ఆ విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.
Go Back to Shorts
Police

More Telugu News