మళ్లీ ఎన్డీయే గెలుపు.. టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడి

  • ఎన్డీయే వైపు అత్యధికులు మొగ్గు
  • యూపీఏకి 135 సీట్లు 
  • ఏపీలో వైసీపీ హవా 
మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 283 సీట్లు గెలుచుకుంటుందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తద్వారా అత్యధిక మెజారిటీతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. సర్వేలో భాగంగా మొత్తం 17,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు.

 కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకి 135 సీట్లు వస్తాయని, ఇతర కూటములకు 125 సీట్లు వచ్చే అవకాశముందని సర్వేలో తేలింది. కాగా, ఎన్డీయేకి ఈసారి 40.1 శాతం ఓటింగ్ నమోదుకానుందని సర్వే చెబుతోంది. అదే సమయంలో యూపీఏకి 30.6 శాతం ఓట్లు లభిస్తాయట. ఇక, ఏపీ విషయానికొస్తే... 25 లోక్ సభ స్థానాల్లో 22 స్థానాలను వైసీపీ గెలుస్తుందని, తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ 13 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని సర్వే వెల్లడిస్తోంది.
Go Back to Shorts
NDA
BJP
Congress
YSRCP
TRS
KCR

More Telugu News