హీరోగా సినీరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్న కీరవాణి కుమారుడు

  • కీలక పొజిషన్‌లో రాజమౌళి కుటుంబీకులు
  • సంగీత దర్శకుడిగా మొదటి కుమారుడు
  • నూతన దర్శకుడు తెరకెక్కించనున్న చిత్రం
సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల కుమారులంతా దాదాపు సినీ రంగాన్నే ఎంచుకోవడం కామన్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలో మంచి పొజిషన్‌లో ఉన్నవారి తనయులు కూడా దాదాపు అదే రంగాన్ని ఎంచుకుంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం మొత్తం దాదాపు ఇండస్ట్రీలో ఏదో ఒక కీలక పొజిషన్‌లో ఉన్నారు.

రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా, ఆయన సోదరుడు కీరవాణి కుమారుడు సంగీత దర్శకుడిగా ఓ సినిమాకు పని చేస్తున్నారు. మరోపక్క, కీరవాణి రెండో కుమారుడు సింహ హీరోగా సినీరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Rajamouli
Keeravani
Karthikeya
Simha
Industry

More Telugu News