వేదికపై చేతులూపుతూ స్టెప్పులేసిన చంద్రబాబు.. జనం కేరింతలు

  • శనివారం ఇచ్ఛాపురంలో పర్యటించిన చంద్రబాబు
  • తనపై పాటకు స్టెప్పులేసిన టీడీపీ అధినేత
  • చంద్రబాబు జోష్‌తో కార్యకర్తల్లో ఉత్సాహం
టీడీపీ సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూసి ఉత్సాహంగా ఉన్న అధినేత చంద్రబాబులో ఇటీవల జోష్ పెరిగింది. ఎన్నడూలేని విధంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మోదీ, జగన్, కేసీఆర్‌లపై ఇటీవల చేస్తున్న విమర్శలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ చేయనంత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మరింత ఉత్సాహంగా కనిపించారు. ప్రసంగించేందుకు వేదికపైకి ఎక్కుతుండగా ‘‘ఆపదలో గట్టెక్కించే నాయకుడు.. సీఎం చంద్రబాబు నాయుడే’’ అనే పాట ప్లే అవుతోంది. ఇది విన్న చంద్రబాబు హుషారుగా చేతులూపుతూ స్టెప్పులేశారు. పాట వస్తున్నంతసేపు చంద్రబాబు ఇలా చేతులు, కాళ్లు కదుపుతూ జనాల్లో ఉత్సాహం నింపారు. చంద్రబాబు స్టెప్పులు చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు.

Chandrababu
Andhra Pradesh
Ichapuram
Srikakulam District

More Telugu News