విచిత్రం! ఆ ఆసుపత్రిలో 9 మంది నర్సులు గర్భవతులయ్యారు!

  • అమెరికాలో ఘటన
  • రోజుల వ్యవధిలో అందరికీ డెలివరీ డేట్లు
  • సోషల్ మీడియాలో వైరల్
ఏదైనా ఆఫీసులో కానీ, ఆసుపత్రిలో కానీ మహిళా సిబ్బందిలో ఒకరిద్దరు గర్భవతులు కావడం మామూలు విషయమే. కానీ, అమెరికాలోని ఓ ఆసుపత్రిలో ఏకంగా తొమ్మిది మంది నర్సులు గర్భం దాల్చారు. అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ లో ఉన్న మయానే మెడికల్ సెంటర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది ఏప్రిల్, జులై మాసాల మధ్యలోనే ప్రసవించనున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇలా ఆసుపత్రిలో ఉన్న నర్సులందరూ గర్భవతులైతే పేషెంట్లను ఎవరు చూసుకుంటారని ఆసుపత్రి వర్గాలను అడిగితే, తాము అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని, తమకు పక్కా ప్లానింగ్ ఉందని యాజమాన్యం చెబుతోంది. ఇప్పుడా నర్సులకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
USA

More Telugu News