'జబర్దస్త్' షో ను మాత్రం వదిలేది లేదు: నాగబాబు

  • 'జబర్దస్త్' అంటే నాకెంతో ఇష్టం
  • నాకు ఉపశమనం కలిగించే షో అది
  •  ఎంపీగా గెలిచినా 'జబర్దస్త్' చేస్తూనే వుంటాను  
ఈటీవీలో అత్యధిక రేటింగుతో కొన్నేళ్లుగా 'జబర్దస్త్' కామెడీ షో కొనసాగుతోంది. ఈ కామెడీషోకి న్యాయనిర్ణేతలుగా నాగబాబు - రోజా వ్యవహరిస్తున్నారు. ఈ షో నాన్ స్టాప్ గా నవ్వులు పూయించడంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతో వుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు .. 'జనసేన' పార్టీలో చేరడం .. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి. దీంతో ఇక రాజకీయాలపైనే నాగబాబు దృష్టిపెట్టనున్నారనీ, ఆయన జబర్దస్త్' చేయకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై ఆయన స్పందిస్తూ .. 'జబర్దస్త్' అంటే నాకు చాలా ఇష్టం .. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలకి నాలుగు రోజులు మాత్రమే షూటింగు ఉంటుంది. ఆ నాలుగు రోజులు ఎలాగో అలా నేను సర్దుబాటు చేసుకుంటాను. ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ షో చేయడం మానుకోను .. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాను. రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే .. మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పనిచేసిన వాళ్లు చాలామందే వున్నారు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
nagababu

More Telugu News