సుమలత ఫేస్ బుక్ పేజీ బ్లాక్... కుమారస్వామి పనే అంటున్న నటి!

  • జేడీఎస్ పార్టీ ఎంత భయంకరమైందో తెలిసింది
  • చెత్తపనులతో ప్రజల్ని ఫూల్స్ చేయలేరు
  • ఇదిగో నా కొత్త ఫేస్ బుక్ పేజీ... లైక్ చేయండి
సినీ నటి సుమలత లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఎన్నికల ప్రచారం కోసం ఫేస్ బుక్ పేజీ ప్రారంభించగా, ఉన్నట్టుండి అది బ్లాక్ అయింది. ఇదంతా సీఎం కుమారస్వామి కుట్రల ఫలితమేనని సుమలత మండిపడుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తన ఫేస్ బుక్ ఖాతాను తమ అదుపులోకి తీసుకుని బ్లాక్ అయ్యేలా చేశారని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేసి ప్రజల్ని వెర్రివాళ్లను చేయాలంటే కుదరదని అన్నారు.

కాగా, వెంటనే మరో ఫేస్ బుక్ పేజీ ప్రారంభించిన సుమలత దాన్ని లైక్ చేసి షేర్ చేయండంటూ ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు. 'ఈ ఘటనతో మీ జేడీఎస్ ఎంత భయంకరమైన పార్టీ అనే విషయం తెలిసింది కుమారస్వామీ' అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Sumalatha

More Telugu News