రెండో లాలూ ప్రసాద్ నేనే: తేజ్ ప్రతాప్ యాదవ్

  • నా తండ్రి తర్వాతి స్థానం నాదే
  • నేను లాలూ రక్తాన్ని
  • లాలూ ఎంతో ఉత్సాహం ఉన్న వ్యక్తి
బీహార్ లో రెండో లూలూ ప్రసాద్ యాదవ్ తానేనని ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. తాను లాలూ రక్తాన్ని అని... ఆయనే తమకు స్ఫూర్తి అని చెప్పారు. తన తండ్రి తర్వాతి స్థానం తనదేనని అన్నారు. లాలూ కుమారులిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'లాలూ రబ్రీ మంచ్' పేరుతో తేజ్ ప్రతాప్ సొంత పార్టీ కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు తన తమ్ముడు తేజస్విపై కూడా తేజ్ ప్రతాప్ విమర్శలు చేశారు. లాలూ ఎంతో ఉత్సాహం ఉన్న వ్యక్తి అని... రోజుకు 10, 12 సభల్లో పాల్గొనేవారని, ఇప్పుడు చాలా మంది నేతలు రెండు, మూడు సభలకే అలసిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన తేజస్వి విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
laloo
tej pratap
rjd

More Telugu News