గుంటూరు జిల్లాలో 84 మంది ఎస్సైల బదిలీ.. అందరిపైనా అవినీతి ఆరోపణలు

  • ఒకే పోలీస్ స్టేషన్‌లో సంవత్సరాల తరబడి పాతుకుపోయిన ఎస్సైలు
  • బదిలీలకు గత కొంతకాలంగా కసరత్తు
  • ఓట్ల లెక్కింపునకు ముందు నిర్ణయం
గుంటూరు జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 84 మంది ఎస్సైలను ఎస్పీ రాజశేఖర్ బాబు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన ఎస్సైలందరూ ఒకే పోలీస్ స్టేషన్‌లో సంవత్సరాల తరబడి పనిచేస్తుండడం గమనార్హం. అంతేకాదు, అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరి బదిలీకి గత కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. పాలనలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఓట్ల లెక్కింపునకు కొన్ని రోజుల ముందు ఇంత పెద్ద ఎత్తున ఎస్సైల బదిలీలు జరగడం చర్చనీయాంశమైంది.
Go Back to Shorts
Guntur District
SI's
Police
SP
Andhra Pradesh
transfer

More Telugu News