చిన్నప్పటి నుంచి నాకు ఇలాగే అలవాటు: తిరుమలలో దేవినేని ఉమ

  • కాలినడకన తిరుమల కొండెక్కిన ఉమ
  • సీఎంగా చంద్రబాబు కొనసాగాలని దేవుడ్ని కోరుకున్న వైనం
  • మైలవరంలో గెలుపుపై ధీమా
ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లారు. అలిపిరి నుంచి కాలిబాటన తిరుమల చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు బాల్యం నుంచే కాలినడకన తిరుమల వెళ్లడమే అలవాటని, ఇప్పటికీ అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నానని చెప్పారు.

ఓట్ల లెక్కింపు ముందు తిరుమల వెంకన్న ఆశీస్సుల కోసమే వచ్చానని వెల్లడించారు. అంతేగాకుండా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కూడా స్వామివారిని ప్రార్థించినట్టు ఉమ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పరిపాలన ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాలని ఆ స్వామిని కోరుకున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Devineni Uma
Chandrababu
Tirumala

More Telugu News