ఫన్నీగా .. ఇంట్రెస్టింగ్ గా 'ఓ బేబీ' టీజర్

  • సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ'
  • కొరియన్ మూవీకి రీమేక్ 
  • కీలకమైన పాత్రలో లక్ష్మి  
సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' సినిమా రూపొందుతోంది. సౌత్ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్. 70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ .. 20 ఏళ్ల యువతిని ఆవహిస్తే ఎలా వుంటుందనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ ఫాంటసీ కామెడీలో వృద్ధురాలి పాత్రలో అలనాటి కథానాయిక లక్ష్మి కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, పూర్తి వినోదభరితమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. 'నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా వుండదు .. ఒక్కొక్కరికి .. చూస్తారుగా' అంటూ సమంతతో చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకి వెళ్లినవాళ్లకి ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందేమో చూడాలి మరి.
Go Back to Shorts
samanta
lakshmi

More Telugu News