చెల్లెలు ఇల్లొదిలిందని... నలుగురు అక్కలూ ఆత్మహత్యా యత్నం.. ఒకరి పరిస్థితి విషమం!

  • మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
  • ఆరుగురు అమ్మాయిలు ఉన్న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఐదో అమ్మాయి
  • పరువు పోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
తమ చెల్లెలు ఇల్లొదిలి పోయి పరువు తీసిందన్న మనస్తాపంతో నలుగురు అక్కలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఓ ఇంట్లో ఆరుగురు ఆడపిల్లలు ఉండగా, వారెవరికీ ఇంతవరకూ వివాహం కాలేదు. ఈ బుధవారం నుంచి ఐదో అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె గురించి ఆరా తీయగా, ఓ యువకుడితో కలిసి వెళ్లిపోయినట్టు తెలిసింది.

దీంతో తమకంటే చిన్నమ్మాయి వెళ్లిందంటే, కుటుంబం పరువే పోయినట్టని భావించిన వారు, చిన్న చెల్లిని, తల్లిని ఓ గదిలో ఉంచి గడియపెట్టి, పురుగుల మందు తాగారు. ఆ గదిలో నుంచి కేకలు వస్తుండటంతో గ్రామస్థులు వారిని విడిపించి, నలుగురినీ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Sister
Mahabubabad District
Jadcharla
Sucide Attempt

More Telugu News