'ఇస్మార్ట్ శంకర్' ను వదులుకున్నందుకు ఫీలవుతున్న మెగా హీరో

  • 'ఇస్మార్ట్ శంకర్' కథ ముందుగా తేజు దగ్గరికి వెళ్లిందట
  • ఈ సినిమా చేయడానికి వెనకడుగు వేసిన తేజు 
  • సినిమా హిట్ కావడంతో తేజు బాధపడుతున్నాడంటూ టాక్ 
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా విడుదలై వారం తిరక్కముందే లాభాల బాట పట్టేసింది. చాలా కాలం తరువాత ఈ సినిమాతో రామ్ కి హిట్ పడింది. వాస్తవానికి తన తనయుడు ఆకాశ్ తో చేయడానికి పూరి ఈ కథను సిద్ధం చేసుకున్నాడట.

అయితే అప్పుడే అంతటి మాస్ డోస్ వున్న కథ అతనితో వద్దని సన్నిహితులు చెప్పడంతో, సాయిధరమ్ తేజ్ కి వినిపించాడట. అసలే తను వరుస ఫ్లాపులతో ఉండటం వలన, సక్సెస్ అనే మాటను పూరి విని కూడా చాలాకాలం కావడం వలన తేజు అంతగా ఆసక్తిని చూపలేదట. దాంతో పూరి ఈ సినిమాను రామ్ తో చేశాడు. ఈ సినిమాను వదులుకున్నందుకు తేజు చాలా ఫీలవుతున్నాడట. తన ఫ్రెండ్స్ తో ఈ విషయం చెప్పుకుని బాధపడుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
Go Back to Shorts
Puri
teju

More Telugu News