రామ్ కి బోనస్ ఇచ్చే ఆలోచనలో పూరి?

  • హిట్ కొట్టేసిన 'ఇస్మార్ట్ శంకర్'
  • నిర్మాతగా పూరికి భారీ లాభాలు
  •  రామ్ కష్టాన్ని గుర్తించిన పూరి
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన 'ఇస్మార్ట్ శంకర్' మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకి పూరి నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమా దర్శకుడిగా ఆయనకి సక్సెస్ ను ఇవ్వడమే కాకుండా, భారీ లాభాలను సైతం తెచ్చిపెట్టింది.

ఈ సినిమా విజయంలో రామ్ కీలకమైన పాత్రను పోషించాడనే అభిప్రాయాన్ని సన్నిహితుల దగ్గర పూరి వ్యక్తం చేశాడట. రామ్ ఫుల్ ఎనర్జీని చూపిస్తూ, సినిమా విజయంలో కీలకంగా నిలిచాడని భావించిన పూరి, లాభాల నుంచి ఆయనకి బోనస్ ను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. చాలాకాలం తరువాత తనకు లాభాలు వచ్చినా అందులో హీరోకి బోనస్ ఇవ్వాలనుకోవడం విశేషం. 
Go Back to Shorts
Ram
Puri

More Telugu News