ఆ ప్రమాదానికి, నాకు సంబంధం లేదు!: తమిళ నటి యషికా ఆనంద్ వివరణ

  • చెన్నై నుంగంబాక్కంలో యాక్సిడెంట్
  • యషికా చేసినట్టు వచ్చిన వార్తలు
  • సాయపడేందుకే వెళ్లానన్న నటి
చెన్నైలోని నుంగంబాక్కంలో తాను యాక్సిడెంట్ చేసినట్టు వచ్చిన వార్తలను బిగ్‌ బాస్ మాజీ కంటెస్టెంట్, నటి యషికా ఆనంద్ ఖండించింది. ఓ పార్టీలో పూటుగా తాగి, స్నేహితులతో కలిసి కారులో వస్తున్న యషికా, భరత్ అనే డెలివరీ బాయ్‌ ని తన కారుతో ఢీకొట్టిందని, ఆ సమయంలో ఆమె మద్యం తాగి ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయింది. ఇక, దీనిపై స్పందించిన యషికా, తాను ఆ ప్రమాదానికి ఏ మాత్రమూ కారణం కాదని, దాంతో తనకు సంబంధం లేదని తెలిపింది. యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలియదని, ఆ సమయంలో తాను అటువైపు వెళుతూ, ప్రమాదానికి గురైన వారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లానని చెప్పింది. ఈ ప్రమాదంతో తనకు సంబంధం లేదని, ఇక సామాజిక మాధ్యమాల్లో వృథా ప్రచారాన్ని ఆపివేయాలని కోరింది.

కాగా, కమలహాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌ బాస్ రెండో సీజన్ లో తమిళులకు పరిచయమైన యషికా, 'ఇరిట్టు అరైయిల్ మురట్టు కుత్తు' సినిమాలో నటించి పేరు తెచ్చుకుంది.

Yashika
Tamilnadu
Chennai
Accident

More Telugu News