ఇంతకన్నా ఆనందం ఏముంటుంది?... తిరునక్షత్ర మహోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై చంద్రబాబు వ్యాఖ్యలు

  • చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర మహోత్సవం
  • హాజరైన చంద్రబాబు
  • చంద్రబాబును ఆశీర్వదించిన చినజీయర్ స్వామి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును చినజీయర్ స్వామి ఘనంగా సత్కరించి, ఆశీస్సులు అందజేశారు. దీనిపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు.

"లోకహితం కోసం చినజీయర్ స్వామి వారు నిర్వహిస్తున్న తిరునక్షత్ర ఉత్సవంలో పాల్గొన్నాను. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నేనూ భాగస్వామి కావడం కన్నా ఆనందం ఏముంటుంది? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు!" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఉత్సవానికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా హాజరయ్యారు.
Go Back to Shorts
Chandrababu
China Jeeyar Swami
Tirunakshatra Veduka

More Telugu News